ఒకేరోజు 10 వేల పాఠశాలల్లో గ్రంథాలయాల ప్రారంభం

గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర విద్యారంగంలో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 25 May 2023 03:36 IST

1,600 స్మార్ట్‌ తరగతి గదులు కూడా..
ఏర్పాట్లకు మంత్రి సబిత ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర విద్యారంగంలో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. జూన్‌ 20వ తేదీన నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఒకేరోజు 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు, రీడింగ్‌ కార్నర్లు, 1,600 స్మార్ట్‌ తరగతి గదులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారి రమేష్‌, ఇంటర్‌బోర్డు పరీక్షల కంట్రోలర్‌ జయప్రద బాయి, డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు