100 కిలోవాట్ల కరెంటు కనెక్షను ఉంటేనే హరిత ఇంధనం కొనుగోలుకు అనుమతి

‘స్వేచ్ఛాయుత విధానం’(ఓపెన్‌ యాక్సెస్‌)లో హరిత ఇంధనం నేరుగా కొనాలంటే షరతులు పాటించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఉత్తర్వులిచ్చింది.

Published : 26 May 2023 03:38 IST

విద్యుత్‌ నియమావళికి సవరణలు చేసిన కేంద్ర విద్యుత్‌శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ‘స్వేచ్ఛాయుత విధానం’(ఓపెన్‌ యాక్సెస్‌)లో హరిత ఇంధనం నేరుగా కొనాలంటే షరతులు పాటించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు విద్యుత్‌ చట్టంలో సవరణలు చేసి.. కొత్త నిబంధనలను చేర్చి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వీటిప్రకారం ఎవరైనా ఓపెన్‌ యాక్సెస్‌లో బయటినుంచి సౌర, పవన విద్యుత్‌ వంటి హరిత ఇంధనం నేరుగా కొనుగోలు చేయాలంటే వారి ఇల్లు లేదా కార్యాలయం, వాణిజ్యసంస్థకు కనీసం 100 కిలోవాట్ల లోడుతో సాధారణ కరెంటు కనెక్షన్‌ ఉండాలి. లేదా ఒక విద్యుత్‌ డివిజన్‌లో ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఎక్కువ కనెక్షన్లు ఉండి.. వాటన్నింటి లోడు కలిపి 100 కిలోవాట్లు.. అంతకుమించి ఉంటే హరిత ఇంధనం కొనవచ్చు. దానిపై ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం) అదనపు సర్‌ఛార్జిని వసూలు చేయరాదు. ఓపెన్‌ యాక్సెస్‌ సదుపాయం అధికంగా కరెంటు వినియోగించే వ్యాపార, వాణిజ్యసంస్థలు, పరిశ్రమలకు లాభదాయకం. వీటికి వినియోగించే కరెంటుకు యూనిట్‌కు రూ.10 దాకా డిస్కంలు వసూలు చేస్తున్నాయి. అదే ఈ పద్ధతిలో సౌరవిద్యుత్‌ కొంటే యూనిట్‌ రూ.4 నుంచి రూ.5కే వస్తుంది. అధికంగా కరెంటు ఛార్జీలు చెల్లించే పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలంతా ఇలా కొంటే తమ వ్యాపారం, ఆదాయం తగ్గిపోయి నష్టపోతామని రాష్ట్ర డిస్కంలు ఆందోళన చెందుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని