‘కడెం’ మరమ్మతులకు రూ.1.44 కోట్లు మంజూరు

నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి జలాశయం అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.44 కోట్లు మంజూరు చేసింది.

Published : 26 May 2023 03:56 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

కడెం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి జలాశయం అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.44 కోట్లు మంజూరు చేసింది. ఈ జలాశయం గతేడాది జులైలో వచ్చిన వరదలతో దెబ్బతిన్న విషయం తెలిసిందే. వరద గేట్లకు దిగువనున్న అప్రోచ్‌, ఓ వరదగేటు దగ్గర ఆప్రాన్‌ దెబ్బతినగా జర్మన్‌ గేట్లకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోయాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే వీటి మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేపట్టలేదు. ఈ పరిస్థితిపై ‘ఈనాడు’లో ఈ నెల 21న ‘నిధులు రాలే.. పనులు కాలే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బృందం ఈ నెల 22న ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జలాశయం నిండేలోగా మరమ్మతు పనులు చేపడతామని ఈఈ విఠల్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు