మందుల కుంభకోణంలో మందకొడిగా దర్యాప్తు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐలోని బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసు దర్యాప్తు నత్తకు నడకలు నేర్పుతోంది.
ఐఎంఎస్ కేసులో ఏళ్లుగా ఛార్జిషీట్లు నమోదు చేయని అనిశా
కీలక నిందితుడి భార్యపై కేసు కొట్టివేతతో కలకలం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐలోని బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసు దర్యాప్తు నత్తకు నడకలు నేర్పుతోంది. ఈ వ్యవహారంలో నిందితులపై సంవత్సరాలు గడుస్తున్నా అవినీతి నిరోధక శాఖ(అనిశా) ఇప్పటికీ ఛార్జిషీట్ల(అభియోగపత్రాల)ను నమోదు చేయలేదు. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమ్ని మెడ్ నిర్వాహకురాలు సుజాతపై ఉన్న కేసును హైకోర్టు తాజాగా కొట్టివేయడం గమనార్హం. ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించలేకపోయారని న్యాయస్థానం పేర్కొనడాన్ని బట్టే అనిశా దర్యాప్తు తీరును అంచనా వేయొచ్చు. ఈ కుంభకోణంలో సుజాత భర్త కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ కీలక నిందితుడు. అప్పట్లో ఐఎంఎస్ విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన దేవికారాణితో కలిసి శ్రీహరిబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. ఓమ్ని మెడ్ సంస్థను ఏర్పాటు చేసిన బాబ్జీ... ఐఎంఎస్ డిస్పెన్సరీలకు మందుల సరఫరా పేరిట అక్రమాలకు తెర లేపారనేది అనిశా వాదన. డిస్పెన్సరీలకు మందులు పంపకున్నా.. పంపినట్లు చూపి భారీ మొత్తంలో డబ్బు కొల్లగొట్టారని ఆరోపించింది.
దాదాపు రూ.200 కోట్ల సొమ్ము పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అనిశా కేసు నమోదు చేసింది. 2019 సెప్టెంబరులో దేవికారాణి, బాబ్జీలతోపాటు అప్పటి మరికొందరు ఐఎంఎస్ అధికారులపై, పైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసింది. నిధుల్ని కాజేసేందుకు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయడం, వాటి ప్రతినిధులతో కలిసిన అధికారులు వాటాలను పంచుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలను బహిర్గతం చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన సోదాల్లో బాబ్జీ ఒక్కడి ఇంట్లోనే రూ.100 కోట్లకుపైగా విలువైన షేర్ల పత్రాలు లభ్యమయ్యాయి. మిగిలిన నిందితుల ఇళ్లలోనూ అక్రమార్జనతో కొనుగోలు చేసిన స్థిరాస్తుల తాలూకు పత్రాలు, నగలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దర్యాప్తు చేపట్టింది. అయితే మూడున్నరేళ్లు గడిచినా సరైన ఆధారాలు సేకరించి, అభియోగపత్రాలను దాఖలు చేయడంలో అనిశా విఫలమైంది. దీంతో ఇప్పటికే నిందితులంతా బెయిళ్లపై బయటికి వచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు