తెలంగాణ వర్సిటీలో మళ్లీ ‘రిజిస్ట్రార్‌’ వివాదం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామకంపై కొనసాగుతున్న వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ), పాలకమండలి(ఈసీ) మధ్య ఉన్న విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Published : 27 May 2023 05:33 IST

ఇన్‌ఛార్జిగా కనకయ్యను నియమించిన వీసీ రవీందర్‌

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామకంపై కొనసాగుతున్న వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ), పాలకమండలి(ఈసీ) మధ్య ఉన్న విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత 20 నెలల కాల వ్యవధిలో ఆరుగురు రిజిస్ట్రార్లు మారారంటే వర్సిటీలో వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వర్సిటీలోని సీనియర్‌ ఆచార్యులు కనకయ్యకి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం వీసీ ఆచార్య రవీందర్‌ ఉత్తర్వులిచ్చారు. పాలకమండలి గతంలో నియమించిన ఆచార్య యాదగిరే రిజిస్ట్రార్‌గా కొనసాగుతారంటూ గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన భేటీలో ఈసీ సభ్యులు మరోసారి తీర్మానించారు. యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఆర్డర్‌ లేనందున నియామకం చెల్లదంటూ మొదటి నుంచి వీసీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వివాదంతో ఎవరిని డ్రాయింగ్‌ అధికారిగా గుర్తించాలో తెలియక వర్సిటీలోని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని