అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి బౌద్ధ క్షేత్ర విగ్రహాలు

సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో లభించిన బౌద్ధమత చారిత్రక ఆధారాలు, విగ్రహాలు అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు దక్షిణ కొరియాలో జరగనున్న అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనకు ఎంపికయ్యాయి.

Published : 27 May 2023 05:27 IST

నాగారం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో లభించిన బౌద్ధమత చారిత్రక ఆధారాలు, విగ్రహాలు అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు దక్షిణ కొరియాలో జరగనున్న అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. దీంతో పురావస్తు శాఖ అధికారులు వాటిని శుక్రవారం దిల్లీకి తరలించారు. జులై నుంచి నవంబరు వరకు న్యూయార్క్‌లో, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు దక్షిణ కొరియాలో అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ మేరకు ఫణిగిరి మ్యూజియంలో భద్రపరిచి ఉన్న మండప స్తూపం, 2 సింహతోరణాలు, బౌద్ధ జాతక కథలను తెలిపే విగ్రహాలను ప్రదర్శనకు తరలించారు. పురావస్తు శాఖ అధికారులు వాటిని ఈ నెల 12న తరలించేందుకు యత్నించగా కొందరు అడ్డుకోవడంతో విరమించుకున్నారు. తిరిగి శుక్రవారం సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బుజ్జి తదితరుల పర్యవేక్షణలో విగ్రహాలను తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని