జూన్‌ 12, 13 తేదీల్లో భారత జాగృతి సాహిత్య సభలు

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో ‘స్వరాష్ట్రంలో సాహితీ వికాసం’ పేరుతో రెండు రోజుల పాటు సాహిత్య సభలను నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Updated : 28 May 2023 03:29 IST

ఇకపై ఏటా ఆచార్య జయశంకర్‌ సాహిత్య జాగృతి పురస్కారం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్తు ప్రాంగణంలో ‘స్వరాష్ట్రంలో సాహితీ వికాసం’ పేరుతో రెండు రోజుల పాటు సాహిత్య సభలను నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇకపై ప్రతిఏటా ఆచార్య జయశంకర్‌ సాహిత్య జాగృతి పురస్కారం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. శనివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రావతరణ దశాబ్ది సంబురాల సందర్భంగా సాహిత్య వికాసాన్ని విస్తృతం చేసేందుకు పూనుకున్నాం. జూన్‌ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే సభల్లో తెలంగాణ సాహిత్యంపై సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయి. జూన్‌ 12 ఉదయం స్వరాష్ట్రంలో సాహితీ వికాసం పేరుతో జరిగే ప్రారంభ సమావేశంతో సాహిత్య సభలు మొదలవుతాయి. ఆరు విడతల్లో అంశాలవారీగా జరిగే సభల్లో  సాహితీమూర్తుల ప్రసంగాలు ఉంటాయి. 13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశంతో సాహిత్య సభలు ముగుస్తాయి. ప్రతిఏటా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే రచనలు చేసిన సాహితీవేత్తకు ఆచార్య జయశంకర్‌ సాహిత్య జాగృతి పురస్కారం బహూకరిస్తాం’’ అని కవిత వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు