సీమచింతాకులో దూరే పట్టుచీర

సీమచింతాకులో దూరేలా అతి పల్చని పట్టుచీరను తయారుచేశారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల శ్రావణ్‌.

Published : 28 May 2023 03:44 IST

సీమచింతాకులో దూరేలా అతి పల్చని పట్టుచీరను తయారుచేశారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల శ్రావణ్‌. సూది రంధ్రంలో దారం దూర్చినట్లు.. ఈ చీరను సీమచింతాకులోంచి దూర్చి ఆశ్చర్యపరిచారు. సంబంధిత వీడియో స్థానికంగా వైరల్‌ అయింది. 46 అంగుళాల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు, 100 గ్రాముల నూలుతో ఈ చీరను తయారు చేసినట్లు శ్రావణ్‌ తెలిపారు. ఇందుకు అయిదు రోజుల సమయం పట్టిందని, చీర బరువు 150 గ్రాములు ఉంటుందని వెల్లడించారు.

 న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని