సీఏలు ఆర్థిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు
చార్టర్డ్ అకౌంటెంట్లు(సీఏ) దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ల వంటి వారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్
మాదాపూర్, న్యూస్‌టుడే: చార్టర్డ్ అకౌంటెంట్లు(సీఏ) దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ల వంటి వారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సీఏల పాత్ర ఎంతో కీలకమని, సీఏలు తలచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని పేర్కొన్నారు. సీఏలు నిబద్ధతతో పనిచేస్తూ క్లయింట్లతో సక్రమంగా పన్నులు కట్టించాలని సూచించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయన్నారు. గతంలో మోదీకి వీసా ఇచ్చేందుకు నిరాకరించిన దేశాలే ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి ఘన స్వాగతం పలుకుతున్నాయని, ఇది భారత ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. యువత అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించాలన్నారు. ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల శ్రీధర్ మాట్లాడుతూ.. సీఏ పూర్తిచేసుకున్న వారు వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ మంచి గుర్తింపు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు దయానివాస్ శర్మ, ప్రతినిధులు సతీష్‌కుమార్ మైలవరపు, చెంగల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ కొనేటప్పుడు ఏమేం చూడాలి? ఇంతకీ ఏమిటీ నాయిస్ క్యాన్సిలేషన్?