ఎండలతో యాదాద్రీశుని భక్తుల ఇక్కట్లు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులు ఆదివారం తీవ్ర ఎండ వేడితో ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

Published : 29 May 2023 04:16 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులు ఆదివారం తీవ్ర ఎండ వేడితో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మాడ వీధుల్లో కాలుతున్న నల్లరాతి బండలపై నడవలేక పలువురు పరుగులు పెట్టారు. కొండపై ప్రయాణ ప్రాంగణం వద్ద చెప్పులు వదిలిన భక్తులు సీసీరోడ్డు మీదుగా గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు కాళ్లకు వస్త్రాలు, ప్లాస్టిక్‌ కవర్లు చుట్టుకొని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. వేసవి సెలవులు ముగియనున్నందున తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు అధికంగా భక్తులు విచ్చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం చేపట్టారు. మూలవరుల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం బిహార్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఐజీ డాక్టర్‌ ఆశీష్‌, ఐపీఎస్‌ అధికారులు భూపాల్‌ రాజీవ్‌, సంజీవ్‌ అరోరాలు దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని