తెలుగు వారసత్వ దినంగా ఎన్టీఆర్‌ జయంతి

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రోజైన మే 28ని అమెరికాలోని మిల్‌పిటస్‌, శాంటాక్లారా, సన్నీవ్యాలే నగరాలు తెలుగు వారసత్వ దినంగా ప్రకటించాయి.

Published : 29 May 2023 04:16 IST

శాంటాక్లారా, మిల్‌పిటస్‌, సన్నీవ్యాలే నగరాల మేయర్ల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రోజైన మే 28ని అమెరికాలోని మిల్‌పిటస్‌, శాంటాక్లారా, సన్నీవ్యాలే నగరాలు తెలుగు వారసత్వ దినంగా ప్రకటించాయి. ఆదివారం సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్లో ఆయా నగరాల మేయర్లు ఈ ప్రకటన చేసినట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్‌ జనరల్‌ నాగేంద్రప్రసాద్‌ ట్విటర్‌లో తెలిపారు. చిన్ననాటి నుంచి ఎన్టీఆర్‌ చిత్రాలు చూసి పెరిగిన తాను అమెరికాలో జరిగిన ఆయన శతజయంత్యుత్సవాల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని