సురవరం జీవితాన్ని నేటి తరానికి తెలియజేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సురవరం ప్రతాపరెడ్డి ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవారు కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 29 May 2023 04:16 IST

రవీంద్రభారతి, రాంనగర్‌, న్యూస్‌టుడే: సురవరం ప్రతాపరెడ్డి ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవారు కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతిని భాషా సాంస్కృతికశాఖ, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య పురస్కారాన్ని (2023) కసిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి ప్రదానంచేశారు. అనంతరం మాట్లాడుతూ నిద్రాణంలో ఉన్న తెలంగాణ ప్రజలను తన రచనల ద్వారా మేల్కొలిపిన గొప్ప వ్యక్తి ప్రతాపరెడ్డి అని కొనియాడారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగువర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, కార్యదర్శి సురవరం పుష్పలత, కోశాధికారి సురవరం కృష్ణ వర్థన్‌రెడ్డి, ట్రస్ట్‌ సభ్యులు విష్ణువర్థన్‌రెడ్డి, సురవరం అనిల్‌రెడ్డి, కపిల్‌, చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు  ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి  మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని