ఓఆర్‌ఆర్‌ ఒప్పందంపై ఐఆర్‌బీ సంస్థ సంతకం

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌(ఓఆర్‌ఆర్‌) టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు(ఓఅండ్‌ఎం) కార్యకలాపాలకు సంబంధించి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రాయితీ ఒప్పందంపై ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే సంస్థ ఆదివారం సంతకం చేసింది.

Published : 29 May 2023 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌(ఓఆర్‌ఆర్‌) టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు(ఓఅండ్‌ఎం) కార్యకలాపాలకు సంబంధించి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రాయితీ ఒప్పందంపై ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే సంస్థ ఆదివారం సంతకం చేసింది. ఈ మేరకు 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించనుంది. ఇటీవల బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ ఈ టెండర్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. 30 ఏళ్ల పాటు ఈ రాయితీ ఒప్పందం అమల్లో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని