Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడ, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జిన్నారం (గడ్డపోతారం), న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడ, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతకాలంగా స్థానిక పరిశ్రమల నుంచి రాత్రింబవళ్లూ విషవాయువులు వెలువడుతున్నాయని చెబుతున్నారు. శనివారం రాత్రి తీవ్రత ఎక్కువకావడంతో.. పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి 11 గంటల సమయంలో సంబంధిత అధికారి వెంకటేశ్ గాలిలో వీవోసీ (వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్)ని కొలిచే యంత్రంతో గ్రామానికి వచ్చి నమోదుచేశారు. స్థానికంగా వివిధ ప్రాంతాల్లో వీవోసీ కనిష్ఠంగా 1.340, గరిష్ఠంగా 1.450 పాయింట్లుగా చూపింది. సాధారణంగా వీవోసీ 0.50 వరకు ఉండొచ్చని, అంతకుమించితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. సాధారణ వీవోసీకి మూడు రెట్లు ఎక్కువగా గడ్డపోతారంలో విషవాయువులు నమోదుకావడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా