పదోన్నతులు కల్పించండి
రాష్ట్రంలో అర్హులైనవారికి సివిల్ సర్జన్ పదోన్నతులు ఇచ్చి.. కొత్తగా ఏర్పాటుచేసిన డీఎంహెచ్‌వో పోస్టులను సీనియారిటీ ఆధారంగా కేటాయించాలని తెలంగాణ పబ్లిక్‌హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావును కోరారు.
మంత్రి హరీశ్‌రావుకు పబ్లిక్‌హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ వినతులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైనవారికి సివిల్ సర్జన్ పదోన్నతులు ఇచ్చి.. కొత్తగా ఏర్పాటుచేసిన డీఎంహెచ్‌వో పోస్టులను సీనియారిటీ ఆధారంగా కేటాయించాలని తెలంగాణ పబ్లిక్‌హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావును కోరారు. మంత్రిని ఆదివారం కలిసిన ప్రతినిధులు రాష్ట్రంలో డీఎంహెచ్‌వో పోస్టులను 38కి పెంచడంతో పాటు 40 కొత్త పీహెచ్‌సీలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి జనార్దన్ వివిధ అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో పనిచేస్తున్న వైద్యులందరికీ సీఏఎస్ క్యాడర్‌తో పాటు డీసీఎస్, సీఎస్ క్యాడర్‌లను కూడా మంజూరు చేయాలని కోరారు. అపల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లకు రూ.52 వేల వేతనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నవారికి రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో ఏఎన్‌ఎంలకు 7 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
14న ప్రత్యేక కార్యక్రమాలు..
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 14న వైద్య ఆరోగ్య శాఖ సాధించిన విజయాలను వివరించాలని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ కె.రమేష్‌రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం
-
Bengaluru traffic : కారులో నుంచి ఆర్డర్ చేస్తే పిజ్జా వచ్చేసింది.. అట్లుంటది బెంగళూరు ట్రాఫిక్!
-
Hyderabad: మరో రెండు కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన.. 12వేల మందికి ఉపాధి
-
ChatGPT: చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్‌టైమ్ సమాచారం