UPSC-Civils: కఠినంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష!

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్ష.. గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు.

Updated : 29 May 2023 07:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్ష.. గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో దినపత్రికలు కచ్చితంగా చదివితే మాత్రమే జవాబులు రాయగలిగే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. చరిత్రలో ఎక్కువగా ప్రాచీన చరిత్ర నుంచి ప్రశ్నలు వచ్చినట్లు చెబుతున్నారు. జాగ్రఫీలో ముఖ్యమైన ప్రాంతాలపై ప్రశ్నలు అడిగారు. మొత్తానికి ఎలిమినేషన్‌ విధానం పాటించి సరైన జవాబులు గుర్తించేలా ఈసారి ప్రశ్నలు లేకపోవడం గమనార్హం.

మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా ఉందని, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కూడా అర్హత సాధిస్తారని శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ శరత్‌చంద్ర తెలిపారు. ఈసారి కటాఫ్‌ మార్కులు తగ్గుతాయని బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు. జూన్‌ 15 నాటికి ఈ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఏఏ విభాగాల నుంచి ఎన్ని ప్రశ్నలంటే...

పేపర్‌ 1 లో 100 ప్రశ్నలకు గానూ.. వర్తమాన వ్యవహారాలపై 11, ఆర్థికశాస్త్రం, సామాజికాభివృద్ధి 11, చరిత్ర-సంస్కృతి 12, రాజనీతిశాస్త్రం, పరిపాలన 17, పర్యావరణం 20, జాగ్రఫీ 15, జనరల్‌ నాలెడ్జ్‌పై 9, మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారని నిపుణులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు