డిజిటల్ హైవేకు ఏడాది ఆగాల్సిందే..!
తెలంగాణ సహా మూడు రాష్ట్రాలతో అనుసంధానమైన కీలక రహదారి విస్తరణకు ఎదురుచూపులు తప్పడం లేదు.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయం
అంచనా వ్యయం రూ. 4,750 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సహా మూడు రాష్ట్రాలతో అనుసంధానమైన కీలక రహదారి విస్తరణకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈమేరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని ‘డిజిటల్ హైవే’గా విస్తరించే పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో చేపట్టాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ పనులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో.. ఇక ఏడాది వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. దశలవారీగా దేశవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌ఎస్) మౌలిక సదుపాయాలతో ‘సూపర్ ఇన్ఫర్మేషన్ (డిజిటల్) హైవే’లుగా విస్తరించాలని గతంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ జాబితాలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారినీ చేర్చింది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 4 వరుసలను 6కు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే విస్తరణకు అవసరమైన భూసేకరణను గతంలోనే చేయడంతో పనులు త్వరితగతిన చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
* హైదరాబాద్ నుంచి బెంగళూరు దూరం 576 కి.మీ.లు. ఇందులో తెలంగాణ పరిధిలో 190 కి.మీ.లు ఉండగా మిగతా రహదారి ఏపీ, కర్ణాటకల్లో ఉంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు డిజిటల్ హైవేగా విస్తరణకు రూ.4,750 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మార్గాన్ని విస్తరించేందుకు గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిపాదనలు సాగుతున్నాయి. తొలుత అధికారులు సాధారణ జాతీయ రహదారి విస్తరణగానే ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. కేంద్రం డిజిటల్ హైవేగా మార్చాలని నిర్ణయించడంతో మరోదఫా కసరత్తు చేపట్టారు. విస్తరణలో భాగంగా 6 వరుసల రహదారితోపాటు 7 మీటర్ల మేర సర్వీసు రోడ్లను సైతం నిర్మిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 8-10 గంటలు పడుతుండగా.. విస్తరణ అనంతరం ఆ వ్యవధిని కనీసం 2 గంటలు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అంచనా. ఈమేరకు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించే బాధ్యతను గత ఏడాది కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే తుది నివేదిక సిద్ధం అయింది. డిజిటల్ హైవేగా మారుస్తున్న నేపథ్యంలో సర్వీసు రోడ్డు, కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న పరిస్థితులను అధికారులు పరిశీలించారు. తుది డీపీఆర్‌ను ఇటీవల కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం.
* ఈ మార్గాన్ని ఓఎఫ్‌ఎస్‌తో అనుసంధానించడంతో పాటు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళికలో భాగం. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో ప్లగ్ అండ్ ప్లే లేదా ఫైబర్ ఆన్ డిమాôడ్ విధానంలో ఇంటర్నెట్ సేవలు అందించాలని నిర్ణయించారు. కేబుల్ వ్యవస్థతోపాటు రహదారి విస్తరణ పనులను జాతీయ రహదారుల సంస్థ చేపడుతుంది. 5జీ, 6జీ వంటి నవతరం టెలికం సాంకేతికత వ్యవహారాలను టెలి కమ్యూనికేషన్స్ శాఖతోపాటు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) పర్యవేక్షిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ganesh Nimajjanam: ఘనంగా నిమజ్జనోత్సవం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు