సింగపూర్‌లో బతుకమ్మల ప్రదర్శన

సింగపూర్‌లో కేరళ త్రిసూర్‌ పూరమ్‌ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Published : 29 May 2023 04:56 IST

చేగుంట, న్యూస్‌టుడే: సింగపూర్‌లో కేరళ త్రిసూర్‌ పూరమ్‌ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ సంబరాలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణ మహిళలు బతుకమ్మలను పేర్చి ప్రదర్శించారని మెదక్‌ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి బసికె ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని