ఆమ్‌చూర్‌కు డిమాండ్‌..

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ ఏడాది ఆమ్‌చూర్‌ కొనుగోళ్లు అత్యల్ప ధరతో మొదలవ్వగా.. ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు ధర పలుకుతోంది.

Published : 30 May 2023 04:49 IST

నిజామాబాద్‌ యార్డులో ఆల్‌టైం రికార్డు ధర రూ.36,100

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ ఏడాది ఆమ్‌చూర్‌ కొనుగోళ్లు అత్యల్ప ధరతో మొదలవ్వగా.. ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు ధర పలుకుతోంది. సోమవారం క్వింటా ధర రూ.36,100 పలికింది. సోమవారం మెదక్‌ జిల్లా అవేలిఘన్‌పూర్‌కు చెందిన రైతు ఎం.స్వామి తెచ్చిన 6.25 క్వింటాళ్ల పంటకు ఈ మేరకు చెల్లించినట్లు మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఈ ఒక్కరోజే మార్కెట్‌కు 812 క్వింటాళ్ల సరకు రాగా కనిష్ఠ ధర రూ.6,500 ఉండగా సగటున రూ.20,800 వచ్చింది. ఆశాజనకమైన దిగుబడులతోపాటు మంచి ధర పలుకుతుండటంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని