నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
దేశంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఎప్పటికప్పుడు వేగంగా మార్పు చెందుతున్నాయనీ, వాటికి అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్, సీనియర్ ఐఏఎస్ అధికారి బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా అన్నారు.
లోక్‌సభ ఉన్నతాధికారులకు శిక్షణలో సీనియర్ ఐఏఎస్ అధికారి మహేశ్‌దత్ ఎక్కా
ఈనాడు, హైదరాబాద్: దేశంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఎప్పటికప్పుడు వేగంగా మార్పు చెందుతున్నాయనీ, వాటికి అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్, సీనియర్ ఐఏఎస్ అధికారి బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా అన్నారు. లోక్‌సభ కార్యనిర్వాహక, పరిశోధనాధికారులకు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మహేశ్‌దత్ ప్రారంభించారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించడంలో పార్లమెంటు సభ్యులకు సహకరించాలని అన్నారు. అవసరమైన వినూత్న ఆలోచనలను, సలహాలను, సమాచారాన్ని అందించడంలో లోక్‌సభ ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించాలని మహేశ్‌దత్ పేర్కొన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ రూపొందించిన పాఠ్యాంశాలు అధికారులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో, పార్లమెంటరీ విధులను సమర్థంగా నిర్వహించడంలో సాయపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లోక్‌సభ సెక్రటేరియట్ డైరెక్టర్ పీకే మాలిక్, డిప్యూటీ సెక్రటరీ సిద్ధార్థ్ గౌతమ్, చీఫ్ కన్సల్టెంట్ కె.తిరుపతయ్య, కోర్స్ కోఆర్డినేటర్ మహమ్మద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం
-
Mainampally: భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా