జీ-20 సదస్సుకు పటిష్ఠ భద్రత: డీజీపీ

హైదరాబాద్‌లో వచ్చే నెల 4, 5 తేదీల్లో జరిగే జీ-20 దేశాల హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశించారు.

Published : 30 May 2023 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వచ్చే నెల 4, 5 తేదీల్లో జరిగే జీ-20 దేశాల హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశించారు. కేంద్ర మంత్రులతోపాటు కార్యదర్శులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని.. భద్రత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సమావేశాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సోమవారం తన కార్యాలయంలో డీజీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, కస్టమ్స్‌, అగ్నిమాపక శాఖల అధికారులతోపాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం అదనపు డీజీ అభిలాషా బిస్త్‌, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని