రాష్ట్ర వర్సిటీల బలోపేతానికి సింగపూర్‌ ఎన్‌టీయూ సహకారం

విద్య, పరిశోధన రంగాల్లో సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) సహకారం తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.

Published : 30 May 2023 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్య, పరిశోధన రంగాల్లో సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) సహకారం తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వర్సిటీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆచార్య బీవీఆర్‌ చౌదరి సోమవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలోని యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. తమ వర్సిటీ బృందం జులైలో రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన్ను సన్మానించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, ఓయూ ఉపకులపతి రవీందర్‌ పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని