అఖిల భారత అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా శేషగిరిరావు

అఖిల భారత అర్చక సమాఖ్య నూతన కమిటీ సోమవారం వరంగల్‌లో ఏర్పాటైంది. జాతీయ అధ్యక్షుడిగా వరంగల్‌ శ్రీభద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు బండారు శేషగిరిరావు ఎన్నికయ్యారు.

Published : 30 May 2023 04:22 IST

రంగంపేట(వరంగల్‌), న్యూస్‌టుడే: అఖిల భారత అర్చక సమాఖ్య నూతన కమిటీ సోమవారం వరంగల్‌లో ఏర్పాటైంది. జాతీయ అధ్యక్షుడిగా వరంగల్‌ శ్రీభద్రకాళి దేవస్థానం ప్రధానార్చకుడు బండారు శేషగిరిరావు ఎన్నికయ్యారు. జాతీయ కార్యదర్శిగా గండికోట రామచంద్రనాథ్‌, ఉపాధ్యక్షుడిగా ఆనంద్‌కుమార్‌ (చిత్రకూట్‌, ఉత్తర్‌ప్రదేశ్‌), సహాయ కార్యదర్శిగా రోహిత్‌మిశ్రా (సాత్న, మధ్యప్రదేశ్‌), తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కారంపూడి నరసింహాచార్యులను ఎన్నుకున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని శేషగిరిరావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఈనెల 31న హైదరాబాద్‌ గోపనపల్లిలో బ్రాహ్మణ భవన్‌ ప్రారంభిస్తారని, అర్చకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని