బెల్లంపల్లి ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు.. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ సోమవారం దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 30 May 2023 04:22 IST

బెల్లంపల్లి, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ సోమవారం దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఈ విషయాన్ని మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. భారాసకు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో వేడుకున్నారు. ఎమ్మెల్యేకు, ఆరిజిన్‌ డెయిరీకి మధ్య కొంతకాలం నుంచి వివాదాలు జరుగుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు