రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ

రాష్ట్రంలో త్వరలోనే అద్భుతమైన క్రీడా పాలసీ రాబోతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణవ్యాప్తంగా 16,300 గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు వచ్చాయని, ఇలా దేశంలో మరే రాష్ట్రంలో లేవని ఆయన పేర్కొన్నారు.

Updated : 30 May 2023 05:54 IST

‘సీఎం కప్‌-23’ వేడుకలో  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో త్వరలోనే అద్భుతమైన క్రీడా పాలసీ రాబోతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణవ్యాప్తంగా 16,300 గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు వచ్చాయని, ఇలా దేశంలో మరే రాష్ట్రంలో లేవని ఆయన పేర్కొన్నారు. సీఎం కప్‌-2023 తెలంగాణ క్రీడాసంబురాల వేడుక హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ముందుగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు కవాతు నిర్వహించగా.. రాష్ట్ర మంత్రులు డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డిలు గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) ఛైర్మన్‌ డా.ఆంజనేయగౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత గొప్పగా క్రీడా సంబురాలు జరుగుతుంటే దిల్లీలో క్రీడాకారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ.. అవమానిస్తున్నారని ఆరోపించారు. ‘ఉప్పల్‌ స్టేడియం తెలంగాణ సొత్తు. అక్కడి సంఘ సభ్యులు అవినీతిలో కూరుకుపోయి, కేసులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేసే వారెవరైనా కఠినంగా శిక్షించాలి’ అని క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఆదేశించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రచించిన యువతరం పాటల సీడీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు అనిల్‌ కూర్మాచలం, గజ్జెల నగేశ్‌, రవీందర్‌సింగ్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు ముళినిరెడ్డి, జె.జె.శోభ, బాక్సర్లు హుసాముద్దీన్‌, అనూప్‌కుమార్‌, నిఖత్‌ జరీన్‌తో పాటు సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన నిధి, దీప్తి, నవీన్‌, అక్షయ్‌లను సత్కరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు