వ్యవసాయం ఘనత చాటేలా దశాబ్ది వేడుకలు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభమవుతున్నందున తమ శాఖ ఘనత చాటేలా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Published : 30 May 2023 04:22 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభమవుతున్నందున తమ శాఖ ఘనత చాటేలా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై ఆయన సోమవారం సచివాలయం నుంచి తమ శాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉత్సవాలను పురస్కరించుకుని రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేయాలని అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ‘‘వ్యవసాయ రంగానికి జరిగిన మేలును, విజయగాథలను అవతరణ వేడుకల వేళ వివరించాలి. పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఆయా మార్కెట్ల పరిధిలోని ఉత్తమ రైతులను సత్కరించాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు