ఏప్రిల్‌లో పెరిగిన రాష్ట్ర ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెలలో రాష్ట్ర ఆదాయం, వ్యయమూ గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నెల రెవెన్యూ రాబడులు రూ.15,085.34 కోట్లు రాగా, వ్యయం రూ.12,643.85 కోట్లు ఉన్నట్లు కాగ్ సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో ప్రకటించింది.
జీతభత్యాల భారమూ మరింత
కాగ్ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెలలో రాష్ట్ర ఆదాయం, వ్యయమూ గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నెల రెవెన్యూ రాబడులు రూ.15,085.34 కోట్లు రాగా, వ్యయం రూ.12,643.85 కోట్లు ఉన్నట్లు కాగ్ సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో ప్రకటించింది. పన్నులపై ఆదాయం రూ.9,698.65 కోట్లుండగా, రుణాలుగా రూ.5,060 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. జీఎస్టీ ద్వారా రూ.4,081.79 కోట్లు, రిజిస్ట్రేషన్లపై రూ.990.56 కోట్లు, అమ్మకపు పన్నుల ద్వారా రూ.2,303.10 కోట్లు, ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.969.08 కోట్లు, కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద రూ.747.22 కోట్ల ఆదాయం వచ్చింది. గ్రాంట్లుగా కేంద్రం నుంచి ఈ ఏడాది రూ.41,259.17 కోట్లు వస్తుందని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేసినా తొలి నెలలో ఒక్క పైసా కూడా రాలేదని కాగ్ వివరించింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత్తం రెవెన్యూ రాబడులు రూ.2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేయగా తొలి నెలలో అందులో 5.81 శాతం(రూ.15,085 కోట్లు) వచ్చింది. గతేడాది(2022-23) అంచనాలో తొలి నెల 4.18 శాతమే రాగా ఈ ఏడాది 1.63 శాతం వృద్ధి నమోదైంది. పన్నులపై ఆదాయం గతేడాది ఏప్రిల్‌లో రూ.9,291.97 కోట్లు రాగా ఈ ఏడాది రూ.9698.65 కోట్లకు చేరింది. పన్నేతర ఆదాయం మాత్రం గతేడాది వచ్చిన రూ.502.17 కోట్లతో పోలిస్తే తగ్గి రూ.357.64 కోట్లకు పరిమితమైంది. రుణాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కనిపించింది.
గతేడాది ఏప్రిల్‌లో కేవలం రూ.264 కోట్లను రుణంగా తీసుకోగా ఈసారి ఏకంగా రూ.5,060 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గతంలో తీసుకున్న రుణాలపై వడ్డీల చెల్లింపులు రూ.1,483.70 కోట్లున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలకు గతేడాది కేవలం రూ.3,271.65 కోట్లు ఖర్చుపెడితే ఈ ఏప్రిల్‌లో ఏకంగా రూ.6,296.46 కోట్లు వ్యయం చేశారు. ఈ స్థాయిలో వ్యయం పెరుగుదల మరే పద్దులో లేకపోవడం గమనార్హం. పింఛన్ల చెల్లింపులకు గతేడాది ఏప్రిలకన్నా దాదాపు రూ.2 కోట్లు తగ్గించి మొత్తం రూ.1,466.30 కోట్లు ఈసారి ఖర్చుపెట్టారు. ఇలాగే ప్రజా సంక్షేమ పథకాలకు చెల్లించేరాయితీల పద్దు కింద కూడా గతేడాదికన్నా రూ.67.57 కోట్లు తగ్గించి రూ.702.82 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మూలధన వ్యయం రూ.2256.98 కోట్లు ఉంది. ఇది గతేడాది ఇచ్చిన రూ.216.20 కోట్లతో పోలిస్తే బాగా పెరిగింది. మొత్తంమీద రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఈ ఏడాది మొత్తం రూ.38,234కోట్లు ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనా వేయగా తొలి నెలలోనే రూ.5,026.30 కోట్లు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ