Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
అవుటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్‌పై నిరాధార, వాస్తవదూర ఆరోపణలు చేశారంటూ దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తూ ఆ సంస్థ నోటీసులు పంపింది.
లీగల్ నోటీసులు పంపిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా

ఈనాడు, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్‌పై నిరాధార, వాస్తవదూర ఆరోపణలు చేశారంటూ దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా నేత రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తూ ఆ సంస్థ నోటీసులు పంపింది. ఆ వివరాలను సోమవారం విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ నెల 25న మీడియాలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఉద్యమం చేసేవారిని ఐఆర్‌బీ చంపేస్తుందని పేర్కొన్నారని, దీంతోపాటు ఐఆర్‌బీపై పలు బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడంతో పాటు ఐఆర్‌బీ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉన్నాయని తెలిపింది. గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యకేసుతో ఐఆర్‌బీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పుణె సెషన్స్ కోర్టు, ముంబయి హైకోర్టు కూడా క్లీన్‌చిట్ ఇచ్చాయని పేర్కొంది. ఈ వాస్తవాలేవీ తెలుసుకోకుండా సంస్థ పరువును దెబ్బతీసేలా రఘునందన్‌రావు మాట్లాడారని పేర్కొంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాను బ్లాక్‌లిస్టులో పెట్టారనే వ్యాఖ్యలు కూడా పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. పలు జాతీయ ప్రాజెక్టుల్లో ఐఆర్‌బీ పెట్టుబడి భాగస్వామిగా ఉందని.. ఎక్కడా బ్లాక్‌లిస్టులో పెట్టలేదని, వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని తప్పుపట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తమ సంస్థ పరువుకు తీవ్ర భంగం కలిగిందని, ఇందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. లేదంటే రూ.1000 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
-
Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
-
KTR - Modi: మోదీ.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?: కేటీఆర్
-
Maharashtra: నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి
-
Satya Nadella: గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
-
India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!