మిమ్స్‌లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల నిలిపివేత

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌)లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ అడ్మిషన్లను నిలిపివేసినట్లు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ప్రకటించింది.

Published : 31 May 2023 02:55 IST

అనుమతులు వస్తాయన్న యాజమాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌)లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ అడ్మిషన్లను నిలిపివేసినట్లు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం వెబ్‌సైట్‌లో వివరాలను వెల్లడించింది. ఇదే విషయమై మిమ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ... ‘‘మిమ్స్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశాం. తనిఖీల్లో వసతులకు సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉన్నాయని భావించి, సీట్ల భర్తీని మెడికల్‌ కౌన్సిల్‌ నిలిపివేసింది. ఎన్‌ఎంసీ గుర్తించిన లోటుపాట్లను సర్దుకుని, దరఖాస్తు చేసుకున్న తర్వాత మళ్లీ అనుమతులు వస్తాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని