తిరుమల ఘాట్‌రోడ్డులో రక్షణ గోడను ఢీకొన్న కారు

అలిపిరి నుంచి తిరుమలకు వస్తున్న కారు రెండో ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 31 May 2023 03:43 IST

ఇద్దరు తెలంగాణవాసులకు గాయాలు

తిరుమల, న్యూస్‌టుడే: అలిపిరి నుంచి తిరుమలకు వస్తున్న కారు రెండో ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఖిలాఘన్‌పూర్‌కు చెందిన ఎ.రమణయ్య, ప్రమీల దంపతులు వారి కుమారులు అభి, హరికృష్ణ, మరో ఇద్దరు చిన్నారులతో కలిసి తిరుమలకు కారులో బయలుదేరారు. అలిపిరిలో తనిఖీ అనంతరం కారును అభి డ్రైవింగ్‌ చేస్తున్నారు. రెండో ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద అకస్మాత్తుగా కారు వేగంగా వచ్చి రక్షణ గోడను ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని కారును పక్కకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గాయపడిన రమణయ్య, ప్రమీలను తిరుమల అశ్విని ఆసుపత్రికి అంబులెన్సులో తరలించి చికిత్స అందించారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని