స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు నేడు ఆఖరి గడువు

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగియనుంది.

Published : 31 May 2023 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగియనుంది. 125 చదరపు గజాల్లోపు విస్తీర్ణానికి జీవో 58 కింద ఉచితంగా, అంతకు మించిన విస్తీర్ణానికి జీవో 59 కింద మార్కెట్‌ ధర ప్రకారం క్రమబద్ధీకరించి పట్టా అందజేయాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా 2014 జూన్‌ 2 ముందు వరకు ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలు చేసుకున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2020 జూన్‌ 2 వరకు ఆక్రమిత గడువును పొడిగించి మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సింగరేణి ప్రాంతాల్లో ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మాత్రం జూన్‌ నెలాఖరు వరకు గడువు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని