సమాచార కమిషనర్లను నియమించాలి

రాష్ట్ర సమాచార కమిషన్‌లో తక్షణం సమాచార కమిషనర్లను నియమించాలని సీఎస్‌ శాంతికుమారికి సుపరిపాలన వేదిక మంగళవారం విన్నవించింది.

Published : 31 May 2023 03:43 IST

సీఎస్‌కు సుపరిపాలనా వేదిక వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార కమిషన్‌లో తక్షణం సమాచార కమిషనర్లను నియమించాలని సీఎస్‌ శాంతికుమారికి సుపరిపాలన వేదిక మంగళవారం విన్నవించింది. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం పెంపొందించడానికి, అవినీతిని అరికట్టడానికి కేంద్రం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందని వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్టవేయడానికి సమాచార కమిషనర్లను నియమించాలన్నారు. ఇందు కోసం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని