Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు

ధరణి పోర్టల్‌లో ఒక ఊరిని చేర్చడాన్ని అధికారులు మర్చిపోయారు. దీంతో అక్కడి పట్టాదారులు తమ భూముల క్రయవిక్రయాలకు, సర్వేలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 31 May 2023 07:32 IST

కొత్తూరు, న్యూస్‌టుడే: ధరణి పోర్టల్‌లో ఒక ఊరిని చేర్చడాన్ని అధికారులు మర్చిపోయారు. దీంతో అక్కడి పట్టాదారులు తమ భూముల క్రయవిక్రయాలకు, సర్వేలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలివీ..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఒకప్పుడు శేరిగూడ, భద్రాయపల్లిలు రెండు గ్రామాలుగా, రెండు రెవెన్యూ విభాగాలుగా ఉండేవి. భద్రాయపల్లిలో తక్కువ గృహాలు ఉండటంతో ఏళ్ల క్రితమే వారంతా శేరిగూడకు వచ్చేశారు. దీంతో ఒకే గ్రామంగా.. శేరిగూడ భద్రాయపల్లి పంచాయతీగా మార్చారు. కానీ భద్రాయపల్లి రెవెన్యూ పరిధి  విడిగానే ఉంది. శేరిగూడలో 1 నుంచి 78 సర్వే నంబర్లు ఉండగా.. భద్రాయపల్లిలో 1 నుంచి 88 సర్వే నంబర్లు ఉన్నాయి. ధరణిలో శేరిగూడలోని సర్వే నంబర్లను మాత్రమే నమోదుచేశారు. భద్రాయపల్లిలోని నంబర్లను నమోదు చేయలేదు. దీంతో అవి ధరణిలో కనిపించడంలేదు. ఆ భూములను విక్రయించాలన్నా.. సర్వే చేయించాలన్నా రైతులకు సాధ్యపడడంలేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. మంగళవారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సర్పంచి అంబటి ప్రభాకర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని