నేడు ఈడీ విచారణకు అంజన్‌కుమార్‌

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మే 31న దిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Published : 31 May 2023 04:16 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మే 31న దిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆమేరకు తాను విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు నిధుల సేకరణ కేసులో గతేడాది అంజన్‌కుమార్‌, షబ్బీర్‌అలీ, గీతారెడ్డి తదితరులు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అంజన్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.

డీకే శివకుమార్‌ను కలిసిన వీహెచ్‌

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు సోమవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. బెంగళూరులోని డీకే నివాసానికి వెళ్లిన వీహెచ్‌.. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించినందుకు అభినందనలు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు