సముద్రుడి ద్వివర్ణం.. ఆకర్షణీయం

సముద్రం సాధారణంగా నీలివర్ణంలో ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో ఒక్కోసారి లేత, ముదురు నీలం రంగులో కనిపిస్తుంది.

Published : 31 May 2023 04:16 IST

కొత్తపల్లి, న్యూస్‌టుడే: సముద్రం సాధారణంగా నీలివర్ణంలో ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో ఒక్కోసారి లేత, ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. మంగళవారం దీనికి భిన్నంగా ఏపీలోని కాకినాడ తీరం నుంచి ఉప్పాడ వరకు సముద్రంలో రెండు వర్ణాలు కనిపించాయి. తీరం నుంచి ఒక రంగు, కనుచూపు మేరలో మరో రంగులో సముద్ర జలాలు కనిపించడంతో సందర్శకులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఆ రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణను సంప్రదించగా.. సూర్యకాంతి సముద్ర ఉపరితలంపై పడి విచ్ఛిన్నమైనపుడు ఇలా రంగులుగా కనిపిస్తుందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు