ఏకలవ్య విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని 23 ఏకలవ్య విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

Published : 01 Jun 2023 03:38 IST

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 23 ఏకలవ్య విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మే 7వ తేదీన నిర్వహించిన పరీక్షకు 7,252 మంది హాజరయ్యారు. మొదటి విడతలో 1,347 మంది విద్యార్థులకు 23 పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయించారు. అర్హత సాధించిన విద్యార్థులు జూన్‌ 1 నుంచి 10వ తేదీలోగా వారికి కేటాయించిన పాఠశాలల్లో ప్రవేశం పొందాలని మంత్రి తెలిపారు. ఫలితాల్లో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన కిరణ్‌, ఉమేష్‌లు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల అధికారి స్వర్ణలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని