Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి 61 అడుగులు
ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 61 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది.
వేదమంత్రాల మధ్య ఘనంగా కర్రపూజ
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 61 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం వినాయక విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డిలతో కలిసి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వేదమంత్రాల మధ్య ‘కర్ర పూజ’ (తొలిపూజ) చేశారు. ఉత్సవ నిర్వాహకులు రాజ్‌కుమార్, సందీప్ తదితరులు మాట్లాడుతూ.... ‘‘గతేడాది వరకు ఉత్సవాలను పర్యవేక్షించిన సింగరి సుదర్శన్ దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు గతేడాది మాదిరిగానే 69వ ఏటా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించనున్నాం. సెప్టెంబరు మూడో వారంలో వినాయక చవితి ఉంది. పండగకు నాలుగు రోజుల ముందుగానే విగ్రహం పూర్తవుతుంది. పనులను వారం పది రోజుల్లో ప్రారంభిస్తాం. ఆ తర్వాత విగ్రహ నమూనాను ప్రకటిస్తాం’’ అని వెల్లడించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మహేష్‌యాదవ్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్ ఏసీసీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు సత్తయ్య, రాజునాయక్, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన