ట్యూషన్‌ ఫీజుల బకాయిలపై ఉద్యమం

రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజులను ప్రభుత్వం చెల్లించకుంటే జూన్‌ మొదటి వారం నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేజీ టూ పీజీ ఐకాస స్పష్టంచేసింది.

Published : 01 Jun 2023 03:38 IST

ప్రభుత్వం చెల్లించకుంటే విద్యార్థులకు టీసీలు ఇవ్వం: కేజీ టూ పీజీ ఐకాస

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజులను ప్రభుత్వం చెల్లించకుంటే జూన్‌ మొదటి వారం నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేజీ టూ పీజీ ఐకాస స్పష్టంచేసింది. సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఐకాస ఛైర్మన్‌ రమణారెడ్డి, కన్వీనర్‌ గౌరి సతీష్‌ తదితరులు మాట్లాడారు. 2021-22, 2022-23 విద్యా సంవత్సరాలకు సంబంధించి రూ.700 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. జూన్‌ 2 లోగా బకాయిలను చెల్లించకుంటే మొదటి వారం నుంచి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. తొలుత మొదటి వారంలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని, జూన్‌ 15 తర్వాత రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేస్తామని, 20వ తేదీ తర్వాత కోర్సు పూర్తయిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు చెల్లించిన తరువాతే టీసీలు ఇస్తామని వివరించారు. సమావేశంలో ఐకాస ప్రతినిధులు బాలకృష్ణారెడ్డి, సిద్దేశ్వర్‌, మధుసూదన్‌రెడ్డి, చంద్రయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

* రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1335 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ విన్నవించింది. మంత్రిని కలిసిన వారిలో సంఘం ప్రతినిధులు రామేశ్వరరావు, రేష్మరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్‌ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని