రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలి

ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాంగణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దాన్వే ఆదేశించారు.

Published : 01 Jun 2023 03:38 IST

కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దాన్వే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాంగణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ పాటిల్‌ దాన్వే ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, పార్కింగ్‌ సౌకర్యాలు, స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమాచారం, కోచ్‌ల డిస్‌ప్లే బోర్డులు సక్రమంగా ఉండాలని సూచించారు. రోడ్‌ అండర్‌ బ్రిడ్జీలు(ఆర్‌యూబీ), రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీల(ఆర్‌ఓబీ) పనుల్లో జాప్యం జరగకుండా గుత్తేదారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షించాలన్నారు. సికింద్రాబాద్‌, తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, జోన్‌ అదనపు జనరల్‌ మేనేజర్‌ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని