వైభవోపేతం.. అమ్మవారి తెప్పోత్సవం

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం రాత్రి కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 01 Jun 2023 04:21 IST

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం రాత్రి కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పద్మసరోవరంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపకాంతుల నడుమ ఉత్సవం రమణీయంగా సాగింది. అనంతరం స్వామివారు తిరుచ్చి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి తెప్పపై విహరించనున్నారు. 

తిరుచానూరు, న్యూస్‌టుడే

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని