పోలవరం ప్రాజెక్టులో చిరుత సంచారం

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత పులి కనిపించింది. ప్రాజెక్టు మళ్లింపు రహదారిలో టిప్పర్‌తో వెళ్తున్న డ్రైవర్‌ సెల్‌ఫోన్‌తో దాని ఫొటోలు తీశారు.

Published : 01 Jun 2023 04:21 IST

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత పులి కనిపించింది. ప్రాజెక్టు మళ్లింపు రహదారిలో టిప్పర్‌తో వెళ్తున్న డ్రైవర్‌ సెల్‌ఫోన్‌తో దాని ఫొటోలు తీశారు. నీళ్లు తాగిన చిరుత రోడ్డుపైకి కొంతదూరం వచ్చి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ప్రాజెక్టులో కలకలం రేగింది. పోలవరం రేంజర్‌ ఎం.దావీద్‌రాజు సిబ్బందితో వచ్చి చిరుత పాద ముద్రల కొలతలు తీసుకున్నారు. ప్రాజెక్టులోని లేబర్‌ క్యాంపుల్లోని కార్మికులు ఒంటరిగా బయటకు రావద్దని అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాలు ఖాళీ చేయడంతో వన్య ప్రాణులు సంఖ్య పెరిగిందని, అక్కడే కొన్ని మకాం పెట్టాయని గుర్తించినట్లు రేంజర్‌ తెలిపారు.

తిరుపతి జిల్లా కరకంబాడిలోనూ..

రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కరకంబాడిలోని ఎర్రమిట్ట-అమరరాజా పరిశ్రమ ప్రహరీ వెనుక చిరుత సంచారాన్ని స్థానికులు గమనించి గ్రామస్థులకు తెలిపారు. అప్పటికే పరిశ్రమ సీసీ కెమెరాల్లో చిరుతను గుర్తించి అప్రమత్తమయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని