దశాబ్ది ఉత్సవాల కానుకగా ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ

ఆర్టీసీ ఉద్యోగులకు మరో కరవు భత్యం(డీఏ) ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా జూన్‌ వేతనంతో కలిపి అందించనుంది.

Published : 02 Jun 2023 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు మరో కరవు భత్యం(డీఏ) ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా జూన్‌ వేతనంతో కలిపి అందించనుంది. 2022 జులైలోనే ఆర్టీసీ ఉద్యోగులకు 4.9శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న దాన్ని ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రకటించింది. ‘తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో 29 రోజుల పాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తాజాది కలిపి ఇప్పటివరకు ఏడు డీఏలు ఇచ్చాం. మిగిలిన మరో డీఏను త్వరలోనే ప్రకటిస్తాం’ అని సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎంపీ సజ్జనార్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని