మేలో ద.మ.రైల్వేకు రికార్డుస్థాయి ఆదాయం

వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మే నెలలో అటు ప్రయాణికులు.. ఇటు సరకు రవాణాలో రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది.

Updated : 02 Jun 2023 04:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మే నెలలో అటు ప్రయాణికులు.. ఇటు సరకు రవాణాలో రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. మొత్తం 2.12 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.513.41 కోట్లు ఆర్జించింది. 538 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లతో అదనంగా 4.65 లక్షల మంది ప్రయాణించారు. ఇప్పటివరకు 2022 ఏప్రిల్‌లో వచ్చిన రూ.467.82 కోట్లే అత్యధిక ఆదాయంగా ఉంది. సరకు రవాణాలో 12.517 మిలియన్‌ టన్నులు రవాణా చేసి రూ.1,236.36 కోట్లు గడించింది. ఇప్పటివరకు 2023 మార్చిలో 12.370 మిలియన్‌ టన్నుల సరకు రవాణాతో ఆర్జించిన రూ.1,065.15 కోట్లే నెలవారీ ఆదాయంలో రికార్డుగా ఉంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని