నీటి వాటాల అంశాన్ని కేంద్ర జల్‌శక్తికి పంపండి

కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు నీటి వాటాలకు సంబంధించిన అంశాన్ని వెంటనే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు నివేదించాలని నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు గురువారం లేఖ రాశారు.

Published : 02 Jun 2023 04:01 IST

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు నీటి వాటాలకు సంబంధించిన అంశాన్ని వెంటనే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు నివేదించాలని నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. గత నెల 10న బోర్డు సమావేశం జరిగింది. కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్‌ 66శాతం, తెలంగాణ 34శాతం వినియోగించుకుంటుండగా, ఇకపై 50:50 నిష్పత్తిలో ఉండాలని తెలంగాణ కోరింది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర జల్‌శక్తికి నివేదించాలని సమావేశం నిర్ణయించింది. దీనిపై నిర్ణయం వచ్చే వరకు ఆయా రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా నీటి విడుదలపై బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొనేలా నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేంద్ర జల్‌శక్తికి ఈ అంశాన్ని నివేదించలేదని, కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైనందున వెంటనే పంపాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. అనుమతి లేని ప్రాజెక్టులకు నీటిని తీసుకొనే విషయంపై చర్యలు తీసుకోవాలని, 2022-23లో ఎక్కువగా తీసుకొన్న నీటి విషయాన్నీ నివేదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని