లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి

చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు డిమాండ్‌ చేశారు.

Published : 02 Jun 2023 04:01 IST

ఐఎంఏ అధ్యక్షుడు బీఎన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు డిమాండ్‌ చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సహకరించే వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, వైద్యమండలికి సిఫార్సు చేస్తామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వరంగల్‌లో లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తున్న వారిని పోలీసులు, వైద్యాధికారులు పట్టుకోవడం అభినందనీయం. ఆడపిల్లల సంఖ్య తగ్గితే సమాజంలో అసమానతలు తలెత్తుతాయి. ఈ విషయంపై చైతన్యం తేవడానికి ఐఎంఏ కృషి చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని