డీఏ సరే.. వేతన సవరణ ఏది?

ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు వేతన సవరణ చేయకుండా డీఏ ప్రకటించడం పట్ల ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 02 Jun 2023 04:01 IST

ఆర్టీసీ నిర్ణయంపై సంఘాల ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు వేతన సవరణ చేయకుండా డీఏ ప్రకటించడం పట్ల ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాజాది కలిపి ఏడు డీఏలకు బకాయిలు ప్రకటించకపోవడంతో ప్రతి కార్మికుడు రూ.లక్షల్లో నష్టపోయారు’ అని గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘2017, 2021 వేతన సవరణలు చేయలేదు. అలవెన్సులూ పెంచలేదు. 2019 జులై 1 నుంచి డీఏ బకాయిలూ చెల్లించలేదు. ఇప్పుడు నామమాత్రంగా ఒక్క డీఏ ప్రకటిస్తారా?’ అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని