ఒక్క రోజే రూ. 298.76 కోట్ల మద్యం సరఫరా

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది.

Published : 02 Jun 2023 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. మే నెలాఖరున (31న) ఒక్క రోజే ఏకంగా రూ.298.76 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలింది. 3,31,915 కేస్‌ల లిక్కర్‌, 2,55,517 కేస్‌ల బీర్లు.. దుకాణాలకు తరలాయి. ఇటీవలి కాలంలో ఇదే రికార్డు. సాధారణంగా రోజుకు సగటున రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల విక్రయాలు సాగుతాయి. మే నెలాఖరు రోజున అంతకు నాలుగైదు రెట్లు అధికంగా డిపోల నుంచి దుకాణాలకు మద్యం తరలడం గమనార్హం. నెల చివరి రోజు కావడంతో ఎక్సైజ్‌ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి మద్యాన్ని లిఫ్ట్‌ చేయించారన్న చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు