కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి ఛైర్మన్‌గా పి.నారాయణ, సభ్యులుగా శివశంకర్‌, మంచె నర్సింహులు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 02 Jun 2023 04:12 IST

మంత్రి మల్లారెడ్డి

గాంధీనగర్‌, బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి ఛైర్మన్‌గా పి.నారాయణ, సభ్యులుగా శివశంకర్‌, మంచె నర్సింహులు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై ఛైర్మన్‌, సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రం నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా.. భారాస ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు సైతం ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. అనంతరం భారత రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ (బీఆర్‌టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్‌లో వారికి అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందుకోసం త్వరలో ప్రణాళికా సంఘం, కార్మిక సంఘాలు, కార్మిక శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, రోహిత్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కార్మికశాఖ అదనపు కమిషనర్‌ డా.గంగాధర్‌, సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌, జంటనగరాల సంయుక్త కమిషనర్‌ శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని