వానాకాలం ఎరువుల పంపిణీలో జాప్యం
తెలంగాణలో వానాకాలం సీజన్‌లో ఎరువుల పంపిణీ ఆలస్యం కానుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో దీనిపై ప్రభావం చూపుతోంది.
మార్క్‌ఫెడ్ వద్ద సిద్ధంగా నిల్వలు
ఇంకా ధాన్యం కొనుగోళ్లలోనే సహకార సంఘాలు
అది పూర్తయ్యాకే ఎరువుల సరఫరాపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో వానాకాలం సీజన్‌లో ఎరువుల పంపిణీ ఆలస్యం కానుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో దీనిపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో కొనుగోళ్లలో తలమునకలై ఉండటం వల్ల ఎరువుల దిగుమతిని ఇంకా ప్రారంభించలేదు. జూన్ రెండోవారం తర్వాతే ఎరువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్ కోసం మే మొదటి పక్షం నుంచే ఎరువుల పంపిణీ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎరువుల అమ్మకాల సీజన్ మొదలుకాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ సంస్థ.. 4 లక్షల టన్నుల యూరియా, 40 వేల టన్నుల డీఏపీ, 70 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను గోదాముల్లో నిల్వ చేసింది. రాష్ట్రంలోని సహకార సంఘాలు మార్క్‌ఫెడ్‌కు డబ్బులు చెల్లించి ఎరువులను తీసుకొని వెళ్లి రైతులకు విక్రయించాలి. ఇప్పటివరకు ఒక్క సొసైటీ కూడా ఎరువులను తీసుకెళ్లలేదు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే ఎరువుల కోసం వస్తామని సొసైటీల వారు చెబుతున్నారు.
మరో పక్షం రోజుల తర్వాతే..
రాష్ట్రవ్యాప్తంగా 562 సొసైటీలలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. చివరి గింజ వరకు కొనుగోళ్లు కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో సొసైటీలు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. కోతల ఆలస్యం కారణంగా మరో పక్షం రోజుల పాటు రైతులు ధాన్యాన్ని తెచ్చే వీలుంది. వాటిని కొని రైస్ మిల్లులకు పంపిన తర్వాతే సహకార సంఘాల్లో గోదాములు ఖాళీ అయి ఎరువులను నిల్వచేసే వీలుంది. ఈ కారణాలతో వచ్చేనెల రెండో వారం తర్వాత ఎరువుల సేకరణ జరిగే వీలుందని సొసైటీల పాలకవర్గాలు చెబుతున్నాయి. ధాన్యం, పంట ఉత్పత్తులు క్రయవిక్రయాలు పూర్తికాకపోవడం, రైతుల చేతికి సొమ్ము రాకపోవడంతో పాటు రుతుపవనాలు ఆలస్యం కావడం.. వల్ల వానాకాలం సీజన్ కోసం ఎరువుల కోసం అన్నదాతలు ముందుకురావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ధాన్యం, పంట ఉత్పత్తులను విక్రయించిన కొద్దిమంది మాత్రమే ఎరువుల కోసం వస్తున్నారని వారు చెబుతున్నారు. ఎరువుల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఈసారి వానాకాలం సీజన్ మీద ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ