తెలంగాణ సాధించిన ఘన విజయమిది
తొమ్మిదేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ... అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలారిష్టాలను దాటుకుని, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
దేశానికి సరికొత్త మోడల్‌ను పరిచయం చేశాం
మహోజ్వల స్థితికి చేరుకుంటున్నాం
తొమ్మిదేళ్లలో గుణాత్మక వృద్ధి
వాడవాడలా వేడుకలను జరుపుకోవాలి
ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తొమ్మిదేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ... అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలారిష్టాలను దాటుకుని, అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు వెనుకబాటుకు గురైన తెలంగాణ... రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలోనే గుణాత్మక అభివృద్ధిని సాధించి... దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, తెలంగాణ లాంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ తరహాలో దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తయి... పదో ఏడాదిలోకి అడుగిడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పదో రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ కోసం వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్ని ఏకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా తీర్చిదిద్దాం.
ఈ పోరాటంలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని, అడ్డంకులను అధిగమించాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వేలాది సభలను నిర్వహిస్తూ సబ్బండ వృత్తులు, సకలజనుల్ని సమీకరిస్తూ, సమన్వయం చేసుకుంటూ అందరి భాగస్వామ్యం, సహకారంతో శాంతియుత పద్ధతిలో పోరాటం చేశాం’’ అని వివరించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ప్రక్రియను, ఈ ఉద్యమంలో సహకరించిన వారందరినీ సీఎం గుర్తు చేసుకున్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనుసరించిన నిర్దిష్ట కార్యాచరణ, బోధించు... సమీకరించు... పోరాడు అనే పంథాను గుర్తుచేసుకున్నారు. ‘‘వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థికం సహా సమస్త రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్నాం. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాలపాటు అంగరంగ వైభవంగా, పండగ వాతావరణంలో జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర సాధన ఫలాలు ఆస్వాదిస్తున్న ఈ సమయంలో సంతోషాలను పంచుకుంటూ... ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములై, వాడవాడలా సంబరాలను ఘనంగా జరుపుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి